మార్ఫింగ్ ఫొటోపై సింగర్ చిన్మయి ఫైర్
సింగర్ చిన్మయి శ్రీపాదపై కొంతకాలంగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ తాళి వేసుకోవడం చిన్మయి ఇష్టం అన్నప్పటి నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఓ ఫొటో వైరలవుతుండగా.. దానిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. తన ఫొటోను మార్ఫింగ్ చేశారని, దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశానని తెలిపింది. కొందరు తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.