పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

KNRL: ఎమ్మిగనూరులో ఇవాళ తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి పర్యటించారు. శిల్పా కాలనీ, పార్క్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో జాప్యం చేయకుండా, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచించారు.