రామాలయంలో సప్తాహం ప్రారంభం
AKP: శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం ఉపమాక మెరక వీధి రామాలయంలో ఇవాళ ఉదయం సప్తాహం ప్రారంభం అయింది. ఈనెల 27వ తేదీ వరకు వారం రోజులపాటు సప్తహ భజన కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన భజన బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తు భజనలు చేస్తాయని పేర్కొన్నారు.