VIDEO: ఆలయాలో దీక్ష స్వాముల ప్రత్యేక పూజలు
KMR: నాగిరెడ్డిపేట్ మండలంలో హనుమాన్ స్వాములు మండల దీక్షలో భాగంగా నిత్యం ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని హనుమాన్ దీక్ష స్వాములు మంగళవారం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. మరో రెండు రోజుల్లో హనుమాన్ జయంతి నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయాలను ముస్తాబు చేశారు. హనుమాన్ స్వాములు హనుమాన్ కీర్తనలు గావిస్తూ భక్తిపారవశంలో మునిగి తేలుతున్నారు.