సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం
WNP: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న నీలమ్మ నాగరాజు గృహప్రవేశానికి ఆయన హాజరై దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.