రోడ్డు ప్రమాదంలో ఐకేపీ సీసీ మృతి

JGL: పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన ఐకేపీ సీసీ రవికుమార్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై రవికుమార్ వెళ్తుండగా మండలంలోని నందగిరి గ్రామం వద్ద ఒక్కసారిగా కోతి అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. అతడికి తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.