దేవరకొండ ఆర్టీసీ డిపోలో ఘనంగా మహిళా దినోత్సవం
NLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేవరకొండ ఆర్టీసీ డిపోలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ (DM) విజయ కుమారి ముఖ్య అతిథిగా హాజరై, మహిళా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ సైదులుతో పాటు డిపో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.