జిల్లాలో 230 మిలియన్ ఏళ్ల శిలాజాలు లభ్యం

జిల్లాలో 230 మిలియన్ ఏళ్ల శిలాజాలు లభ్యం

MNCL: చెన్నూరు, కోటపల్లి పరిధిలోని బొప్పారం ఫారెస్ట్ డివిజన్ అడవుల్లో 230 మిలియన్ ఏళ్లకు చెందిన శిలాజాలను HYDకు చెందిన చరిత్ర పరిశోధన బృందం సేకరించింది. సింగరేణి కాలనీ సిబ్బందితో కలిసి సంయుక్తంగా వృక్ష, జంతువుల శిలాజాలను సేకరించారు. వీటిని తెలంగాణ స్టేట్ మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.నాగరాజు తెలిపారు.