మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

PDPL: ముత్తారం మండలం పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుండ్లపల్లిలో రైతులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. తాము ధాన్యం ఆరబెట్టుకునేందుకు స్థలం లేక గుట్ట ప్రాంతంలో తమ సొంత ఖర్చులతో చదును చేయించుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులకు సంబంధించి మట్టి తవ్వకాల కోసం యంత్రాలతో వచ్చిన వారిని రైతులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగి వెళ్లారు.