బీజేపీ అధ్యక్షుడు నడ్డా పర్యటన ఖరారు

VSP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా త్వరలో విశాఖపట్నం రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా, 'బీజేపీ ఏకత – ఆంధ్రప్రదేశ్ శక్తి' పేరుతో నిర్వహించనున్న సభకు వేదిక కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు.