కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్

BNR: చౌటుప్పల్ మండలం మల్కాపూరం గ్రామంలోని ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య పరిశీలించారు. 2, 3 రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే కాంటాలలో ఎలాంటి లోపాలు లేకుండా రైతులను మోసం చేయవద్దని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనా రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.