VIDEO: ధర్వేశిపురంలో ప్రాతఃకాల నిజ అభిషేకం, నిత్యారాధన

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం గురువారం పురస్కరించుకొని ప్రాతః కాల నిజ అభిషేకం, నిత్యారాధన పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు కుంకుమ పూజలు చేశారు. వడి బియ్యం సమర్పించారు.