తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ‘నోటా’ ప్రవేశం
NZM: ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ తొలిసారిగా 'నోటా' ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఓట్ల లెక్కలో నోటాకు మెజారిటీ వచ్చినా ఎన్నిక రద్దు కాదు. నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. నోటా ఓటు కేవలం నిరసన వ్యక్తీకరణ మాత్రమే. ఫలితాలపై ప్రభావం ఉండదు. కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటా ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.