రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కనిగిరి పట్టణంలో విద్యుత్ టవర్ల పనుల కారణంగా శనివారం ఉదయం 7:30 గంటల నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ పవన్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారత్ పెట్రోల్ బంక్ రోడ్డు, ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్డు, పాత కూచిపూడిపల్లి, పామూరు బస్టాండు తదితర ప్రాంతాలలో సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.