పురుషుల కృషిని గౌరవించడమే మెన్స్ డే స్ఫూర్తి: రాణి
MHBD: డోర్నకల్ పట్టణంలోని సెయింట్ ఆగ్నెస్ పాఠశాలలో ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పురుష టీచర్లను పూలు, శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ప్రిన్సిపల్ రాణి మాట్లాడుతూ.. పురుషులు కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ శ్రమ, ప్రేమ, బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వారి కృషిని గౌరవించడమే మెన్స్ డే స్ఫూర్తని అన్నారు.