ఇరాన్‌పై దాడి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమపై ముందస్తు దాడికి ప్రణాళిక రచిస్తోందని తెలిసి దానికంటే ముందే తాము దాడి చేశామని ఆయన తాజాగా వెల్లడించారు. చర్చల పేరుతో ఇరాన్ కాలయాపన చేస్తూ, తమపై దాడి చేయాలని చూసినట్లు అర్థమయ్యాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.