రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

NTR: ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజ్ రోడ్డులో ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, ట్రాఫిక్ ఆర్‌ఐ కె.కృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, మొబైల్ ఫోన్ వినియోగం నివారణ, మైనర్ డ్రైవింగ్, వన్‌వే ఉల్లంఘనలు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.