‘ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం, మేధావుల మౌనం’
SDPT: సీఎం రేవంత్ రెడ్డి, కొందరు సోకాల్డ్ మేధావులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సమ్మెలకు మద్దతుగా రోడ్లపైకి వచ్చినవారు, ఇప్పుడు నోరు కూడా తెరవడం లేదన్నారు. ఈ మేధావులకు కార్మికులపై ప్రేమ కంటే కేసీఆర్‌పై ద్వేషమే ఎక్కువని విమర్శించారు.