అంతర్రాష్ట్ర వాహన దొంగ అరెస్ట్
అన్నమయ్య: మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడు దేవరాజ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన మూడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం, బెట్టింగ్ వ్యసనాల కారణంగా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.