“ధైర్య స్పర్శ” కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

“ధైర్య స్పర్శ” కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

CTR: గంగవరం మండలంలోని మదర్ థెరిస్సా కాలేజీలో నిర్వహించిన “ధైర్య స్పర్శ” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. సుమారు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింక్‌లకు స్పందించవద్దని సూచించారు. సైబర్ మోసాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.