ధర్మవరంలో మంత్రి ‘టీ’ ముచ్చట

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఉదయం ధర్మవరంలో పర్యటించారు. ఉదయాన్నే స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలను కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి, సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం మంచి అనుభూతిని కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం వారితో కలిసి టీ తాగారు.