‘SIR ఆడిన ఆట ఇకపై నడవదు’
NDAపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీహార్ ఫలితాల్లో NDA విజయం వెనుక 'SIR' పాత్ర ఉందని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల కుట్రలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాబోయే ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో పనిచేయవని అఖిలేష్ పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు CCTVల మాదిరిగా అప్రమత్తంగా ఉంటారని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.