జాతీయ సదస్సులో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

జాతీయ సదస్సులో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

ATP: తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత తొలి జాతీయ సదస్సులో జిల్లా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి పాల్గొన్నారు. సహచర ప్రజాప్రతినిధులను వారు ఆప్యాయంగా పలకరించారు. వికసిత భారత్‌కు మహిళలు ఎలా నాయకత్వం వహించాలనే అంశంపై మహిళలు ఈ సదస్సులో చర్చించనున్నారు. సదస్సు రేపు కూడా కొనసాగుతుందని నేతలు తెలిపారు.