5 లక్షల LOCని అందజేసిన రూరల్ ఎమ్మెల్యే

NZB: డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం (బి)కి చెందిన మేకల నిహారిక అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఆమె చికిత్స కోసం రూ. 5 లక్షల LOCను మంజూరు చేశారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.