అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
KMM: చింతకాని మండలం జగన్నాధపురం వద్ద పోలీసులు ఆదివారం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ముదిగొండ మండలం గంధసిరి మున్నేరు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, దానిపై కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు పోలీసులు వెల్లడించారు.