చర్లపల్లి జైలులో ఖైదీ దురుసు ప్రవర్తన

చర్లపల్లి జైలులో ఖైదీ దురుసు ప్రవర్తన

MDCL: చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమండ్‌లో ఉన్న ఐసీస్ ఉగ్రవాది సమీ బుధవారం ఓ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తనను చంచల్‌గూడ జైలుకు తరలించాలని సమీ డిమాండ్ చేయగా, కోర్టు ఆదేశాలు ఉంటేనే సాధ్యమని కానిస్టేబుల్ చెప్పారు. దీనిపై ఆగ్రహించిన సమీ కానిస్టేబుల్‌తో గొడవపడ్డారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చర్లపల్లి SI తెలిపారు.