'దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు'
SKLM: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ మేరకు దివ్యాంగుల నుంచి 9 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.