'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి'
VZM: ఎస్‌కోట మండలం ధర్మవరం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం జరిగిన జాతీయ బాలల దినోత్సవంలో జూనియర్ సివిల్ జడ్జి కనక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారానికి కృషి చేయాలని కోరారు. అలాగే చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.