పాక్ ఆటగాళ్లకు PCB భారీ జరిమానా
T20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ బోర్డ్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. టోర్నీలో జట్టు వైఫల్యానికి బాధ్యతగా ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' కథనం ప్రకారం.. ఆటగాళ్ల అసమర్థత వల్లే జట్టు సెమీస్ చేరలేకపోయిందని బోర్డు భావిస్తుంది.