VIDEO: రైతులకు తప్పని కూలీల కొరత కష్టాలు..!
KMR: మద్నూర్ మండలంలో శనగపంట కోత కోసం రైతులకు కూలీల కొరత కష్టాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం శనగ పంట చేతి దశకు రావడంతో కోత కోసం కూలీల కోసం అష్టకష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఎకరాకు పంట కోసి కుప్ప వేయడానికి రెండు నుంచి మూడు వేలు చెల్లిస్తున్నామని అయిన కూలీల కొరత ఉందని రైతులు వాపోతున్నారు.