రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
NTR: నందిగామలోని శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాసం మాస శివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అన్నాభిషేకం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు దండిబోట్ల బాలకృష్ణ శాస్త్రి తెలిపారు. నేడు రాత్రి 7.00 అన్న సంతర్పణ కార్యక్రమం ఉందని ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కోరారు.