బ్రిడ్జి నిర్మించే వరకు పోరాటం: బీజేపీ
గద్వాల జిల్లాలోని కర్నూల్-రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిలో అయిజ సమీపంలోని పెద్దవాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి బ్రిడ్జిపై ఆయన ఆందోళన చేపట్టారు. 30 ఏళ్లుగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.