మేయర్ స్రవంతి వైసీపీలో లేదు: కాకాణి
నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. 'ఆమె మా పార్టీకి ఎప్పుడో రాజీనామ చేశారు.. అమాయక గిరిజన మహిళను గద్దె దించడానికి అధికార పార్టీ నాయకులు అవినీతి నిందలు వేయడం తగదు' అని పేర్కొన్నారు.