రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
NDL: మార్కాపురం జిల్లా దోర్నాల (మం) చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ట్రయల్ రన్‌లో వెళ్తున్న మినీ వాన్ ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న అంకన్న(25) అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లి రోదన స్థానికులను కలచివేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.