VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన కారు .. దంపతులు మృతి
కోనసీమ: తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో కారు అదుపుతప్పి పంట కాలువలో పడటంతో భోగిల్లి వీర వెంకట సతీష్(40), భార్య కిరణ్మయి(38) మృతి చెందారు. కాకినాడలో బంధువుల పెళ్లికి హాజరై వెలగతోడుకు తిరిగి వస్తుండగా ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వెనక సీట్లో ఉన్న సతీష్ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను స్థానికులు సకాలంలో రక్షించారు. పోలీసులు క్రేన్ సహాయంతో కారు బయటకు తీశారు