అపార్ట్‌మెంట్ నుంచి కోట్లు విసిరేసిన మహిళ
చైనాలో ఒక మహిళ తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి కోట్ల విలువైన నోట్లను గాలిలోకి విసిరేసింది. ఆ నగదు ఏరుకోవడానికి జనం పోటీ పడటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కుటుంబ కలహాలు, మానసిక వేదన వల్లే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు. చాలామంది తాము ఏరుకున్న డబ్బును నిజాయితీగా తిరిగి ఇచ్చేశారు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.