నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
కృష్ణా జిల్లాలోని పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఇవాళ తెలిపింది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.