బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

MBNR: రాజాపూర్ మండలం పలుగుగుట్ట తాండ గ్రామానికి చెందిన పూల్ సింగ్ అనారోగ్యంతో మృతిచెందగా శనివారం బీఆర్ఎస్ నాయకుడు చించోడు అభిమన్యు రెడ్డి సూచన మేరకు స్థానిక నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆయన అందించిన రూ. 5వేలను బాధిత కుటుంబానికి అందజేశారు. భవిష్యత్తులోను కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.