తంగళ్ళపల్లిలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం
SRCL: దేశం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేశారని కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. హైదరాబాదులో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సంస్కరణలు, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయం, హరిత విప్లవం లాంటి ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు.