మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
NTR: మైలవరం దేవునిచెరువు ఎంపీపీ పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత వివరాలు తెలుసుకున్నారు. వారానికి ఐదుసార్లు గుడ్లు, ప్రతిరోజు చిక్కీలు ఇస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించి అమలు సంతృప్తికరంగా ఉందన్నారు.