భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి

BDK: భద్రాచలం వద్ద ఉప్పొంగి ప్రవహించిన గోదావరి నిన్న రాత్రి నుంచి శాంతిస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు 51.60 అడుగులకు చేరుకున్న నీటిమట్టం రాత్రి 9 గంటల నాటికి 50.10 అడుగులకు చేరింది. దీంతో చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అటు ధవళేశ్వరం వద్ద కూడా ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.