ఈనెల 18న ఢిల్లీకి చంద్రబాబు
AP: ఈనెల 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవనున్నారు. పార్లమెంట్‌హౌస్‌లో పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై, ముఖ్యంగా విభజన హామీలు, నిధుల కేటాయింపు వంటి విషయాలపై చర్చించనున్నారు.