డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు కేసులు నమోదు

NRPT: నారాయణపేట పట్టణంలో గురువారం నిర్వహించిన డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.