రాజుపాలెంలో ఉచిత పశువైద్య శిబిరం

రాజుపాలెంలో ఉచిత పశువైద్య శిబిరం

KDP: రాజుపాలెంలోని టంగుటూరులో ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతా నుంచి వచ్చిన రైతులు తమ పశువులను పరీక్షల కోసం తీసుకువచ్చి పరీక్షలు చేయించారు. అనంతరం వారికి అవసరమైన మందులను వైద్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వద్ది సురేఖ, ప్రభుత్వ పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.