'వేడి వేడి ఆహార పదార్థాలను భుజించాలి'

SKLM: ప్రస్తుత వర్షాకాలంలో వేడివేడి ఆహార పదార్థాలను భుజించాలని జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వంశీకృష్ణ అన్నారు. జలుమూరు మండలం జోణంకి పంచాయతీ పరిధి అబ్బాయి పేట గ్రామంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నివసిస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు.