VIDEO: వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు

VIDEO: వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు

BPT: అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామికి నిర్వహించిన 'ఉష్ట్ర (ఒంటె) వాహన సేవ' అత్యంత వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రాకారాల చుట్టూ ఊరేగించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.