ఆకునూరి మురళి అర్బన్ నక్సలైట్: బండి సంజయ్
TG: విద్యారంగంలో మార్పులపై సిఫార్సులు కాకుండా టీచర్ల జీతాలు తగ్గించాలని విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శించారు. రిపోర్ట్ ఇచ్చినవాళ్లకు నైతికత లేదని, ఇది ఎవరినీ సంప్రదించకుండా AC కింద కూర్చుని రూపొందించిన నివేదిక అని మండిపడ్డారు. ఆకునూరి మురళికి అర్బన్ నక్సలైన్ భావజాలం ఉందని, ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేయడాన్ని BJP వ్యతిరేకిస్తోందన్నారు.