VIDEO: వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షలు

VIDEO: వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షలు

కృష్ణా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరగాలంటూ చిలకలపూడి ఇన్స్‌స్పెక్టర్ షేక్ అబ్దుల్ నబీ ఓ వీడియో గురువారం విడుదల చేశారు. మండపాల ఏర్పాటు, అనుమతులు తప్పనిసరి, ట్రాఫిక్‌కి ఆటంకం లేకుండా చూడాలి అని కోరారు. డీజేలకు అనుమతి లేదు, రాత్రి 10 తర్వాత కార్యక్రమాలు నిషేధమని స్పష్టం చేశారు. బలవంతపు చందాలు, అశ్లీల కార్యక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.