BREAKING: టీమిండియా ఓటమి

BREAKING: టీమిండియా ఓటమి

రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి చవిచూసింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మార్‌క్రమ్ (110) సెంచరీతో చెలరేగాడు. మాథ్యూ బ్రిట్జ్కే (68), బ్రెవిస్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ చెరో రెండు వికెట్లు తీశారు.