'EVM గోదాముకు కట్టుదిట్టమైన భద్రత ఉంది'

WNP: RDO కార్యాలయం సమీపంలో ఉన్న గోదాములోని EVMలను త్రైమాసిక తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు EVM తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. EVMలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని పేర్కొన్నారు.